← Back to news

9వ తరగతిలో 'థర్డ్ లాంగ్వేజ్' వద్దన్న సుప్రీంకోర్టు!

By sahani· 16 Jul 2026· India
9వ తరగతిలో 'థర్డ్ లాంగ్వేజ్' వద్దన్న సుప్రీంకోర్టు!

9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ఈ కీలక దశలో కొత్త లాంగ్వేజ్ నేర్పించడం స్టూడెంట్స్‌పై ఎక్స్‌ట్రా ప్రెజర్ పెంచుతుందని కేంద్రానికి సూచించింది. CBSE తీసుకొచ్చిన త్రీ-లాంగ్వేజ్ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ కామెంట్స్ చేసింది. చిన్న క్లాసెస్ నుంచే దీన్ని అమలు చేస్తే బెటర్ అని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై తదుపరి విచారణలో కేంద్రం, CBSE తమ డెసిషన్‌ను చెప్పనున్నాయి.

More in Education