← Back to news

వ్యవసాయ విద్యార్థుల బిగ్ అచీవ్‌మెంట్

By yerraguntla sunil· 1d ago· Udayagiri, Sri Potti Sriramulu Nellore
వ్యవసాయ విద్యార్థుల బిగ్ అచీవ్‌మెంట్

జాతీయ స్థాయి పరీక్షల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. కళాశాల నుంచి పరీక్షలకు హాజరైన 149మందిలో 53మంది ఉత్తీర్ణత సాధించారు. మొక్కల విజ్ఞాన శాస్త్రంలో హేమంత్ కుమార్ రెడ్డి జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించగా.. కీటకశాస్త్రంలో మణి వెంకటకుమార్ 36వ ర్యాంకు సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలకు 5వేల నుంచి 7వేల వరకు స్కాలర్‌షిప్ లభించే అవకాశం ఉందని కళాశాల అసోసియేట్ డీన్ గోపికృష్ణ తెలిపారు.

More in Local