CECకి ఆ పిటిషన్ షాక్ ఇస్తుందా?

CEC జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఫైల్ అయిన పిటిషన్ హాట్ టాపిక్ అయ్యింది. దీన్ని నెక్ట్స్ వీక్ విచారిస్తామని కోర్టు చెప్పడంతో, ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. జ్ఞానేష్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనీ.. ఇవి చెల్లకుండా చెయ్యాలని పిటిషన్‌లో కోరారు సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్. CJI సూర్యకాంత్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఇది ఇలాంటి రెండో పిటిషన్. CECకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్న సమయంలో ఈ పిటిషన్లు హీట్ పెంచుతున్నాయి.



