కంకరగుట్ట RUB వద్ద ట్రాఫిక్ సమస్య

గుంటూరు నగరంలోని కంకరగుట్ట గేట్ RUB వద్ద నాలుగు మార్గాల నుంచి వాహనాల రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ గందరగోళం నెలకొంటోంది. స్పష్టమైన లేన్‌లు, దిశా సూచికలు లేకపోవడంతో వాహనాలు ఒకదానికొకటి అడ్డంగా వస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లేన్ మార్కింగ్‌లు, దిశా సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.





