EVM గోదాంలో కలెక్టర్ తనిఖీ

అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డ్‌లోని EVM గోదాంను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో గోదాంలో భద్రపరిచిన BUలు, CUలు, VVPATలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను కూడా కలెక్టర్ పరిశీలించారు. EVMల గోదాము వద్ద నిరంతరాయంగా పటిష్టమైన నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



