సుగాలి ప్రీతి తల్లి వీల్‌చేర్ యాత్రలో ఉద్రిక్తత!
సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లి పార్వతి చేపట్టిన వీల్‌చేర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తన కుమార్తె చనిపోయి తొమ్మిదేళ్లయినా ఇంతవరకు న్యాయం చేయలేదని, కూటమి ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. నిందితులను అరెస్ట్ చేస్తే తాము రోడ్డెక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తుంటే వందలాది మంది పోలీసులతో తమ యాత్రను అడ్డుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



