← Back to news

బాలిక కిడ్నాప్‌కు యత్నం.. అంతలోనే పోలీసుల ఎంట్రీ

By dk· 13 Aug 2026· రంగారెడ్డి జిల్లా
బాలిక కిడ్నాప్‌కు యత్నం.. అంతలోనే పోలీసుల ఎంట్రీ

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ హనుమాన్‌నగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబం పరిచయస్తుడి వద్ద రూ.30వేలు అప్పు తీసుకుంది . డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అప్పు తీర్చే వరకు మీ రెండేళ్ల కుమార్తెను తీసుకెళ్తానంటూ బెదిరించి, బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే డయల్‌-100కు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్‌ పోలీసులు బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.