విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి!

కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఎక్కువగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ స్డడీ వెల్లడైంది. 19 విద్యాసంస్థలకు చెందిన 2.43 లక్షల మంది వివరాలను పరిశీలించారు. వారిలో 34 శాతం మంది క్యాంపస్‌లో ఉన్నా ఒంటరిగా అనిపిస్తోందని చెప్పారు. 15 శాతం మంది ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 9 శాతం మందికి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు పేర్కొన్నారు. చదువు ఒత్తిడి, కుల, లింగ వివక్ష కూడా సమస్యలకు కారణాలుగా తెలిపారు.



