← Back to news

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: PDSU

By DK· 1d ago
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: PDSU

అనంతపురం జిల్లా గుంతకల్లులో PDSU ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల సమస్యలపై నాయకులు డిమాండ్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కోర్సులు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. BC, SC, ST, మైనార్టీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

More in Local