← Back to news

ఈ-పంట నమోదు.. రైతులకు కీలక సూచన

By KUCHIPUDI BUJJIBABU· 14h ago· New Bank Colony, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ముళ్లపూడి పద్మావతి దుగ్గిరాల మండలంలో ఖరీఫ్ ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. గొడవర్రు, చినపాలెం గ్రామాల్లో పంటలు, సర్వే నంబర్లు చెక్ చేశారు. రైతులతో మాట్లాడి నీటి వనరులు, ఎరువుల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు ఈ-పంట నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్. విజయబాబు, VAO సుధీర్, సాయికృష్ణ, మౌనిక, రైతు ట్రైనర్లు సుధారాణి, జయ, పాల్గొన్నారు.

More in Local