ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌కి బిగ్ షాక్!

ఆన్‌లైన్‌లో పాయిజనస్ 'ఉమ్మెత్త' కాయలు, విత్తనాలు అమ్మడంపై కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ యాప్స్ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 కింద ఈ ప్లాట్‌ఫామ్స్ నుండి ఉమ్మెత్త ప్రొడక్ట్స్, యాడ్స్‌ను వెంటనే రిమూవ్ చేయాలని, వీటి సేల్స్ స్టాప్ చేయాలని ఆదేశించారు.


