AI ఏజెంట్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే.. రిస్క్ ఏంటి?

AI Agent అంటే మనం ఇచ్చిన పని పూర్తయ్యే వరకు స్వయంగా ప్లాన్ చేసి, టూల్స్ ఉపయోగించి కొన్ని చర్యలు తీసుకునే AI. ఇది పని వేగంగా చేయగలదు. కానీ తప్పు సమాచారాన్ని నమ్మినా, తప్పుడు ఆదేశాలను అనుసరించినా సమస్యలు రావచ్చు. ఉదాహరణకు డేటా బయటకు పంపడం లేదా అనుకోని పని చేయడం జరగొచ్చు. NIST, OWASP కంపెనీలు ఇలాంటి రిస్క్‌లను గుర్తించాయి. అందుకే AIకి అవసరమైనంతే అనుమతులు ఇచ్చి, ముఖ్యమైన పనులను మనుషులే పూర్తి చేసుకోవడం బెటరనే ఒపీనియన్ బిల్డ్ అవుతోంది.



