నేరస్థుడికి ప్రకటన…'The Hindu' క్షమాపణ

సెప్టెంబర్ 12న ‘ది హిందూ’ న్యూస్ పేపర్ ఢిల్లీ ఎడిషన్‌లో ‘డేరా సచ్చా సౌదా’ నాయకుడు గుర్మీత్ రామ్ రహీమ్ కోసం పూర్తి పేజీ ప్రకటన వచ్చింది. 2017లో అత్యాచారం కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ ప్రస్తుతం 21 రోజుల పెరోల్‌పై బయట ఉన్నాడు. ఆ ప్రకటనలో అతనిపై కుట్ర జరిగిందని, అబద్ధపు సాక్ష్యాలు చెప్పారని రాశారు. దైనిక్ భాస్కర్ కూడా అదే ప్రకటనను హిందీలో ప్రచురించింది. SMలో తీవ్ర విమర్శలు వచ్చాక, మరుసటి రోజు ‘ది హిందూ’ ముందు పేజీలో క్షమాపణ చెప్పి, ఆ ప్రకటన అభ్యంతరకరం అని తెలిపింది.




