సిఎం బ్లాక్‌మెయిలర్ అంటూ.. కవిత సెటైర్!
TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ పేరు చెప్తేనే బ్లాక్‌మెయిలింగ్, దందాలు, కబ్జాలు, బెదిరింపులు గుర్తుకొస్తాయని ఆరోపించారు. అసెంబ్లీని కూడా తన అడ్వర్టైజ్‌మెంట్ కోసం వాడుకుంటున్నారని అన్నారు. RTI చట్టాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌తో వేల కోట్లు పోగేశారని ఆరోపించారు. సీఎం మాటలకు, పనులకు అసలు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో ‘బ్లాక్‌మెయిలర్ల సంఘం’ ఉంటే.. దానికి రేవంత్ రెడ్డే ప్రెసిడెంట్‌గా ఉండాలని <a href="https://x.com/RaoKavitha/status/2098686008510558262">సెటైర్ వేశారు.</a>



