← Back to news

అరుణాచల్ ప్రదేశ్‌ లేక్‌లో అరుదైన చేప గుర్తింపు

By Mahesh· 1d ago· AIR· Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్‌ లేక్‌లో అరుదైన చేప గుర్తింపు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో 12వేల 8వందల అడుగుల ఎత్తులో ఉన్న పాంకాంగ్ టెంగ్ సో లేక్‌లో అరుదైన చేప జాతిని సైంటిస్టులు గుర్తించారు. చైనా, టిబెట్ ప్లాటోల ప్రాంతాల్లో కనిపించే ‘స్కిజోపిగాప్సిస్ వడెల్లి’ భారత్‌లో తొలిసారి రికార్డ్ అయ్యింది. ICAR-CICFR సైంటిస్టులు జులైలో కలెక్ట్ చేసిన 10 చేపలను టెస్ట్ చేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ డిస్కవరీతో దేశ ఫ్రెష్‌వాటర్ బయోడైవర్సిటీ మరింత పెరిగింది. ఇలాంటి మరిన్ని జాతులు భారత్‌లో ఉండే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

More in National