← Back to news

ట్రెండ్‌లో కొత్త మార్పు.. జస్ట్‌ వాక్‌కు ఫుల్ క్రేజ్‌!

By A.Ajay· 1h ago
ట్రెండ్‌లో కొత్త మార్పు.. జస్ట్‌ వాక్‌కు ఫుల్ క్రేజ్‌!

వెల్‌నెస్‌ ట్రెండ్స్‌లో ఇప్పుడు జస్ట్‌ వాక్‌ ట్రెండ్‌గా మారింది. అత్యంత సులువైన, ఖర్చులేని వ్యాయామం కావడంతో చాలామంది దీనివైపు ఆసక్తి చూపిస్తున్నారు. రోజూ కొద్దిసేపు వాకింగ్‌ చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లిఫ్ట్‌ బదులు మెట్లు ఎక్కడం, చిన్న దూరాలకు బండి వాడకుండా నడవడం లాంటి చిన్న మార్పులతో రోజువారీ యాక్టివిటీని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. రోజుకు 30 నిమిషాల వరకు నడిస్తే ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు.

More in Current Affairs