కరెంట్ ఏది? సూర్యాపేటలో రోడ్డెక్కిన రైతులు
TG: ప్రభుత్వం కరెంటు సరిగా ఇవ్వట్లేదంటూ సూర్యాపేటలో రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయానికి సరిపడా కరెంటు సకాలంలో ఇవ్వాలని రాస్తారోకో చేశారు. మండల పరిధిలోని ఎర్కారం సబ్‌స్టేషన్ ముందు.. జనగాం రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ స్తంభించింది. KCR ఇచ్చిన 24 గంటల కరెంటు ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు రైతులు.


