గుట్కా స్మగ్లింగ్ అడ్డుకున్న పోలీసుకు సీఎం ప్రశంసలు!
కోయంబత్తూరులో గుట్కా స్మగ్లింగ్‌ను అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ వేలుమురుగన్‌ను తమిళనాడు సీఎం విజయ్ సచివాలయంలో గౌరవించారు. గుట్కా స్మగ్లింగ్‌ను అడ్డుకునే క్రమంలో ఆయన చూపిన ధైర్యాన్ని సీఎం అభినందించారు. వేలుమురుగన్‌తో సీఎం విజయ్ మాట్లాడి, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఫొటోలు దిగారు. ఫ్రంట్‌లైన్ పోలీసు సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



