భారత్ GDP 7.8% పెరిగింది.. ఇంత వేగంగా ఎలా?

భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశ GDP అంచనాలను మించి 7.8% వృద్ధి నమోదైంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం, కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ మరియు సర్వీసుల రంగాలు బాగా పనిచేయడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోలేని సమయంలో కూడా భారత్ ఇంత వృద్ధి సాధించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వేగం ఇకముందు కూడా కొనసాగుతుందా? ఈ వృద్ధి సామాన్యుడికి ఎంతవరకు మేలు చేస్తుంది?



