నాంపల్లిలో చేప ప్రసాదం క్రేజ్!
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు దాదాపు 50 వేల మందికి పైగా జనాలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకున్నారు. వచ్చిన వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా విఐపీలు (VIPs), దివ్యాంగులు, ఇంకా ముసలివాళ్ల కోసం అధికారులు స్పెషల్ కౌంటర్స్ పెట్టారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9PM వరకు ఉంటుంది.



