డ్రైవర్‌లెస్ కార్.. డైరెక్ట్‌గా పోలీస్ వ్యాన్‌కు ఢీ!
పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్ కార్ డెమో కాస్తా మిస్‌ఫైర్‌గా మారింది. పార్క్ చేసి ఉన్న పోలీస్ వ్యాన్‌ను కారు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీ-చౌక్ దగ్గర జరిగిన ఈ డెమోలో జర్నలిస్ట్ ముహమ్మద్ ఆలిజా కారులోనే ఉండి వీడియో రికార్డ్ చేశారు. కారు రిమోట్‌గా ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్‌తో ఆపరేట్ చేస్తున్న టైమ్‌లో కనెక్షన్‌లో ప్రాబ్లమ్ రావడంతో కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొంత నష్టం జరగగా, ఎవరికీ గాయాలు కాలేదు.



