← Back to news

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆసరా

By RAJKUMAR· 1h ago· మందమర్రి
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆసరా

TG : మందమర్రి పాలచెట్టు ఏరియాకు చెందిన దంపతులు చంటి రమేష్, మల్లేశ్వరి అనారోగ్యంతో చనిపోయారు. దాంతో వారి ఇద్దరు పిల్లలు తోడు లేకుండా ఒంటరివారైపోయారు. ఈ విషయాన్ని స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మహమ్మద్ ఆబిద్ తన పుట్టినరోజు సందర్భంగా ఆ పిల్లలకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో ఆ ఇద్దరు పిల్లల కుటుంబానికి కావలసిన నిత్యావసర వస్తువులను ఇచ్చారు.

More in Local