తాటిపాకలో టన్నున్నర రేషన్ బియ్యం సీజ్

AP : రాజోలు మండలం తాటిపాకలో అక్రమంగా తరలిస్తున్న టన్నున్నర పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పొదలాడ నుంచి టాటా ఏస్ వాహనంలో ఈ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం మలికిపల్లికి చెందిన అడబాల సూర్యనారాయణ అనే వ్యక్తివిగా అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని తరలిస్తున్న టాటా ఏస్ వెహికల్‌ను సీజ్ చేశారు.



