← Back to news

సీఎం వస్తే అంబులెన్స్‌కు కూడా దారి లేదు

By Nani Eluri· 15h ago· X

TG: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. బారికేడ్లు, వన్‌వేలతో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వీడియో వైరల్ అవుతోంది. హాస్పిటల్‌కు వెళ్లేందుకు దారి ఇవ్వాలని రోగి కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు ఆపడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభ కోసం తమకు ఇన్ని ఇబ్బందులు ఎందుకంటూ స్థానికులు పోలీసులను ప్రశ్నించారు.

More in TG