కాంగ్రెస్‌లో చేరిన జీవన్గి గ్రామ సర్పంచ్

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామసర్పంచ్ రామని బసప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు MLA బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. MLA బసప్పను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.



