విజయవాడకు టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్!
TOLLYWOOD ఫేమస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ రోజు ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం వేద పండితులు ఆయనకు ఆశీర్వాదం అందించారు. బోయపాటి శ్రీను రాకతో ఆలయ ప్రాంగణంలో సందడిగా మారింది.


