ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కంపెనీ!

నీట్ (NEET) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై ఈ నెల 22 వరకు టెంపరరీ బ్యాన్ విధించింది. ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగనుండటంతో, ఎలాంటి పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ బ్యాన్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం విధించిన టెంపరరీ బ్యాన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ హైకోర్టు డ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.



