← Back to news

సావర్కర్ కేసులో రాహుల్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక తీర్పు!

By Mahesh· 14 Aug 2026
సావర్కర్ కేసులో రాహుల్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక తీర్పు!

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై సంబంధించిన క్రిమినల్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఫైల్‌ చేసిన కంప్లెయింట్‌ను, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు బెంచ్ ఈరోజు కొట్టివేసింది. కేసు నమోదుకు అవసరమైన ప్రభుత్వ అనుమతి (సాంక్షన్) తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. 2022 భారత్ జోడో యాత్రలో సావర్కర్‌ను బ్రిటిష్ సహకారిగా రాహుల్ పేర్కొనడంపై ఈ కంప్లెయింట్‌ నమోదైంది.

More in Legal