← Back to news

ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్

By dk· 13 Aug 2026· మెదక్ జిల్లా
ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి తాగుతున్న యువకులను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నర్సాపూర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి కొందరు యువకులు అతని ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన కాలనీవాసులు వారిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోపే, వారు తప్పించుకుని పారిపోయారు. ఘటన స్థలంలో గంజాయి ప్యాకెట్‌, కూల్‌డ్రింక్ బాటిల్స్ లభించాయి. తప్పించుకున్న యువకులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.