← Back to news

గుంటూరులో అక్టోబర్ 2న నిరసన

By KUCHIPUDI BUJJIBABU· 23h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
గుంటూరులో అక్టోబర్ 2న నిరసన

గుంటూరులో అక్టోబర్ 2న CEC జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న నిరసనలు చేపట్టాలన్న పిలుపులో భాగంగా గుంటూరులో ఉదయం 10 గంటలకు హిమాని సెంటర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. CEC జ్ఞానేశ్‌కుమార్‌పై తొలగింపు, రాజీనామా డిమాండ్లతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

More in Local