ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. ఇంటికే!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 6,255 మంది లబ్ధిదారులకు రూ.2.70 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందనున్నాయి. అక్టోబర్ 1న ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవి అందుతాయి. ఎంపీడీఓ వీసం ప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. సకాలంలో పంపిణీకి చర్యలు చేపట్టారు.



