‘డెమోగ్రఫీ కమిషన్’ ఉద్దేశం అదే: అసదుద్దీన్ ఒవైసీ

ముస్లింల విద్య, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి డేటా సేకరించాలని అడిగినప్పుడు మోడీ ప్రభుత్వం వెంటనే ముఖం తిప్పేసిందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే ఇప్పుడు అమిత్ షా రాష్ట్రాలను ‘డెమోగ్రఫీ కమిషన్’ అడుగుతున్నారని, అంటే ఏ మతం వాళ్లు ఎన్ని వాహనాలు కొన్నారు, ఎంత భూమి ఉంది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ డేటాను వక్రీకరించి ముస్లింలను లక్ష్యంగా చేసి, వాళ్లకు మిగిలిన కొద్ది హక్కులను కూడా తీసేస్తారని ఆరోపించారు.



