ఓయూలో గంజాయి మొక్క.. కలకలం
TG:హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్కను గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, మొక్క అక్కడికి ఎలా వచ్చిందో తేల్చాలని కోరారు. పోలీసులు ఈ కంప్లయింట్ పై విచారణ చేపట్టాల్సి ఉంది.
