FAKE or FACT: ఢిల్లీ పేరు మారబోతుందా?

దేశ రాజధాని ఢిల్లీ పేరు త్వరలో ‘ఇంద్రప్రస్థ’గా మారుతోందని కొంతకాలంగా ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. మహాభారతంలో పాండవుల రాజధాని ‘ఇంద్రప్రస్థం’. BJP MP ప్రవీణ్ ఖండేల్వల్ ఫిబ్రవరిలో అమిత్‌షాకు లేఖ రాసి ఢిల్లీ పేరు ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని కోరారు. VHP కూడా ఈ డిమాండ్ చేసింది. 2026లో ఒక BJP MLA కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఈ ప్రతిపాదన చేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన గానీ, ప్రపోజల్ గానీ రాలేదు. పేరు మార్పు జరగాలంటే అసెంబ్లీ రిజల్యూషన్, కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. అవి ఇంకా జరగలేదు కాబట్టి ఇది FAKE.



