← Back to news

మొగిలేశ్వర స్వామి ఆలయ వేడుకకు MLAకి ఆహ్వానం

By padam Subramanyam· 1d ago· Palamaneru, Palamaner, Chittoor
మొగిలేశ్వర స్వామి ఆలయ వేడుకకు MLAకి ఆహ్వానం

చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత స్వయంభు శ్రీ మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని గ్రామస్థులు MLA అమరనాథ రెడ్డిని మంగళవారం ఆహ్వానించారు. వచ్చే నెల 1న దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయనను కలిసి ఆహ్వానించిన వారిలో కమలనాథరెడ్డి, మంజునాథ్, తదితరులు ఉన్నారు.

మొగిలేశ్వర స్వామి ఆలయ వేడుకకు MLAకి ఆహ్వానం
మొగిలేశ్వర స్వామి ఆలయ వేడుకకు MLAకి ఆహ్వానం

More in Local