కశ్మీర్ టు కన్యాకుమారి.. సైకిల్ యాత్ర

ముగ్గురు రిటైర్డ్ ఆర్మీ అధికారులు.. దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ, డ్రగ్స్ నిర్మూలన, హెల్తీ లైఫ్‌స్టైల్‌పై అవేర్‌నెస్ కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన విలాస్ పాటిల్, మనోజ్ విఠల్ మాలి, ఉదయ్‌బాన్ నిర్వాన్.. శ్రీనగర్ నుంచి 21 రోజుల్లో కన్యాకుమారి చేరాలనుకున్నారు. కార్గిల్ యుద్ధంలో కాలు కోల్పోయిన ఉదయ్‌బాన్.. ఆర్టిఫీషియల్ లెగ్‌తో సైకిల్ తొక్కుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మండే తెలంగాణలోని ఇచ్చోడ చేరి, కన్యాకుమారికి బయల్దేరారు.



