← Back to news

నిర్వాసితుల సమస్య.. CPI(M) మోటార్ యాత్ర!

By Prasad Sode· 1d ago· Kalleru, Chinturu, Polavaram
నిర్వాసితుల సమస్య.. CPI(M) మోటార్ యాత్ర!

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో CPI(M) ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఈ యాత్ర సాగుతుంది. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోరుతూ ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం మురుమూరులో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితుల పునరావాసం ప్రారంభ దశలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local