← Back to news

రైతుల కోసం రైతుబజార్‌లో సౌకర్యాలు: MLA

By DK· 1d ago
రైతుల కోసం రైతుబజార్‌లో సౌకర్యాలు: MLA

విశాఖపట్నం జిల్లా మధురవాడ రైతుబజార్‌ను భీమిలి MLA గంటా శ్రీనివాసరావు సందర్శించారు. రైతుబజార్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశద్వారం ఇరుకుగా ఉండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి వెడల్పు చేయాలని సూచించారు. రైతుబజార్‌లో అడ్డంగా ఏర్పాటు చేస్తున్న అనధికార దుకాణాలను నియంత్రించాలని ఆదేశించారు. కార్యక్రమంలో JC జి. విద్యాధరి, RDO సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు.

More in Local