సమోసాల కోసం ట్రైన్ ఆపేశాడు!
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సమోసాల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా ట్రైన్‌నే ఆపేశాడు. రైలు ఆపి, పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లి సమోసాలు కొనుక్కుని మళ్లీ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్యాసింజర్స్ సేఫ్టీ గురించి కేర్ తీసుకోకుండా ఇలా కేర్‌లెస్‌గా ఉండటంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ మ్యాటర్ రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో లోకో పైలట్‌పై విచారణకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆఫీసర్ ముఖేష్ చెప్పారు.



