వడ్లంలో పౌర హక్కుల దినోత్సవం

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని వడ్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించారు. అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ షరీఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.



