← Back to news

ఫోన్ ఛార్జింగ్ ఓకే.. చార్జర్ సంగతి?

By Nani Eluri· 10h ago
ఫోన్ ఛార్జింగ్ ఓకే.. చార్జర్ సంగతి?

ఫోన్‌కి ఛార్జింగ్ పూర్తయింది.. కానీ చార్జర్‌ను మాత్రం ప్లగ్‌లోనే ఉంచేస్తున్నారా? అయితే ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. ఫోన్‌కు కనెక్ట్ చేయకపోయినా.. ప్లగ్‌లో ఉన్న చార్జర్ కొంత కరెంట్‌ను వినియోగిస్తుంది. దీన్నే ‘Phantom Load’ అంటారు. అంతేకాదు.. ఎక్కువసేపు ప్లగ్‌లోనే ఉంచితే చార్జర్ వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఛార్జింగ్ పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేసి, చార్జర్‌ను తీసేయండి. చిన్న అలవాటు.. కరెంట్ ఆదా, భద్రత రెండూ!

More in Infotainment