10 ట్రైన్లకు హైటెక్ సిటీలో టెంపరరీ స్టాప్!

TG: ఫెస్టివల్ సీజన్‌లో పెరిగే ప్యాసింజర్ రష్‌ను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో 10 ట్రైన్లకు టెంపరరీ స్టాప్ ఇవ్వనుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ వంటి స్టేషన్లపై రష్‌ను తగ్గించడం, ప్రయాణికులకు సౌకర్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు SCR తెలిపింది. దీంతో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ట్రైన్ జర్నీ చేసే వారికి మరింత ఈజీ కానుంది.



