తులం బంగారం హామీ ఏమైంది? : KTR

TG: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని KTR ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న భరోసాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదని, పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో BRS ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



