మహిళలు, బాలికల భద్రతపై అవగాహన

గుంటూరు నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వినియోగం, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొత్తపేట CI వీరయ్య చౌదరి వివరించారు. మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తన, స్నేహాలు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు.



