← Back to news

మెలోడీ గిఫ్ట్.. స్టాక్ మార్కెట్ లో గందరగోళం

By aravinda nyayapati· 20 May 2026· Mumbai
మెలోడీ గిఫ్ట్.. స్టాక్ మార్కెట్ లో గందరగోళం

ఇటలీ పర్యటనలో పీఎం మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి పార్లే మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొన్నారు. దీంతో ఆ షేర్ వాల్యూ 5శాతం పెరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెలోడీ చాక్లెట్లు తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్ అనే కంపెనీ, ఇది అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ లో లేదు. ఇన్వెస్టర్లు కొన్న పార్లే ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేసే కంపెనీ. ఇప్పుడు ఈవిషయం కూడా ట్రెండింగ్ అవుతోంది.

More in Viral

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!
Viral· 2d ago

రొనాల్డో సిస్టర్ కేరళంలో సందడి.. CMతో ఫొటో వైరల్!

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో సందడి చేశారు. కోజికోడ్‌లో ఓ జ్యువెల్లరీ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేరళం CM వి.డి. సతీశన్‌ను కలిశారు. ఇక్కడ రొనాల్డోకు భారీ ఫ్యాన్ బేస్ ఉందని CM చెప్పగా, ఈ విషయం తనకు తెలియదని ఎల్మా అన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో చెబుతానని చెప్పారు. చివర్లో ‘CM సార్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ ఫొటో అడగడంతో ఈ మూమెంట్ వైరల్‌గా మారింది. తరువాత CMతో దిగిన ఫొటోలను ఎల్మా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. <a href="https://x.com/vdsatheesan/status/2095026237718806895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2095026237718806895%7Ctwgr%5E0150c68c6d23d9ff94230cf5dcecf2cd9b6551b7%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fcristiano-ronaldos-sister-elma-visits-kerala-smr-1554789.html">వీడియో లింక్</a>

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!
Viral· 3d ago

రైల్లో ఇండియన్స్ హంగామా.. టూరిస్టులపై కామెంట్స్!

జర్మనీలో ఫుల్ రష్‌గా ఉన్న ఓ రైల్లో కొందరు గుజరాతి ఇండియన్ టూరిస్టులు గట్టిగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యూజర్ ఈ వీడియోను <a href="https://x.com/Amit24TD/status/2094429195527196793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2094429195527196793%7Ctwgr%5Ea95b9a92608886003674bc8a8ac30d78b1151367%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fprathyekam%2Fgermany-train-viral-video-indian-tourists-singing-clapping-sparks-outrage-bsb-1554431.html">'ఎక్స్‌'లో</a> పోస్ట్ చేశారు. రైల్లోని ఇతర టూరిస్టులను సైలెంట్‌గా ఉండగా.. ఇండియన్స్ చేసిన హంగామాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విదేశాల్లో ఇలాంటి వారి బిహేవియర్‌తో ఇండియన్ టూరిస్టులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.