← Back to news

హైస్కూల్‌లో గాంధీ శాస్త్రి జయంతి సెలబ్రేషన్స్

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్‌లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ రాఘవయ్య మాట్లాడుతూ.. గాంధీజీ సత్యం అహింసా మార్గాల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. లాల్‌బహదూర్ శాస్త్రి దేశ సేవకు అంకితమై ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

More in Local