క్లియర్‌కట్ న్యూస్ ఎఫెక్ట్.. సొంతూరిలోనే అవకాశం

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని లక్ష్మాపురంలో నిర్వహించిన వినాయక ఉత్సవాల్లో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రతిభను మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు అభినందించారు. ద క్లియర్‌కట్ న్యూస్‌లో వచ్చిన <a href="https://www.theclearcutnews.com/n/JS6P4k3">కథనానికి</a> స్పందించిన మహిళలు చిన్నారులకు గ్రామంలోనే వేదిక కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. సొంత గ్రామంలోనే పిల్లలకు నృత్య ప్రదర్శనకు అవకాశం కల్పించిన మహిళల చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.



