← Back to news

మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం: జడ్జి నిష్కా

By ARJUN· 1d ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం: జడ్జి నిష్కా

జోగులాంబ గద్వాల జిల్లాలో రాజీకి అవకాశం ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. నిష్కా పత్రు తెలిపారు. కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మధ్యవర్తిత్వంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. తటస్థ వ్యక్తి ఇరు పక్షాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా సహకరిస్తారని వివరించారు.

మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం: జడ్జి నిష్కా

More in Local