పేదల ఓట్లు తొలగిస్తే సహించేది లేదు: MLA కృష్ణారావు

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో SIR ప్రక్రియ నత్తనడకన సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని MLA మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేద ప్రజల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. BLOలు నిత్యం ప్రజల్లో ఉండి నిజమైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం నియోజకవర్గ ERO, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌ను కలిసి SIR సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.



