రెండు లక్షల ఉద్యోగాలు ఏవి ? : సునీతా లక్ష్మారెడ్డి

TG: రేషన్ కార్డులపై CM రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఎందుకు పెడుతున్నారని BRS MLA సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీని KCR ప్రభుత్వం ప్రారంభించిందని, దానికి కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయాన్ని పండుగ చేశామని CM చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం హామీలపై ప్రశ్నలు సంధించారు.



